Home / MOVIES / మెగాస్టార్ మూవీలో గద్దర్

మెగాస్టార్ మూవీలో గద్దర్

ఖైదీ నెంబ‌ర్ 150 చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి వ‌రుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్ర‌స్తుతం ఆచార్య సినిమాతో బిజీగా ఉన్న చిరు త్వ‌ర‌లో లూసిఫ‌ర్ చిత్ర రీమేక్‌గా రూపొందుతున్న గాడ్ ఫాద‌ర్ అనే చిత్ర షూటింగ్‌లో పాల్గొన‌నున్నాడు. మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇటీవలే సెట్స్ మీదకొచ్చింది. అయితే ఈ ప్రతిష్టాత్మక సినిమాలో ప్రజా యుద్ధనౌక, జన నాట్య మండలి కళాకారుడు గద్దర్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారనే వార్త వైర‌ల్‌గా మారింది.

సినిమాలోని ముఖ్య పాత్ర‌కోసం గ‌ద్ధ‌ర్‌ని సంప్ర‌దించార‌ని ఆయ‌న కూడా ఆ పాత్ర‌లో న‌టించేందుకు ఓకే చెప్పార‌ని టాక్స్ వినిపిస్తున్నాయి. వైజాగ్ జైలులో చిత్రీకరించే సన్నివేశాల్లో ఆయన పాల్గొననున్నారట. ఆయనతో పాటు కోలీవుడ్, బాలీవుడ్ నుంచి స్టార్ నటీనటులను ఈ సినిమాలో భాగం చేసే ప్రయత్నాలు చేస్తున్నారట మేకర్స్. తాజాగా వైజాగ్ షెడ్యూల్ జ‌ర‌గాల్సి ఉండ‌గా, సినిమాటోగ్రాఫర్ నిరవ్ షా డేట్స్ కుదరకపోవడంతో కొద్దిరోజులు వాయిదా పడింది.

శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్‌వీఆర్ ఫిలింస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. తమన్ బాణీలు కడుతున్నారు. ఇకపోతే యాంకర్ అనసూయ, నయనతారలతో పాటు బాలీవుడ్‌ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్ కూడా నటిస్తున్నారని స‌మాచారం అందుతుంది. ఈ సినిమా తర్వాత చిరు భోళా శంక‌ర్, బాబీ సినిమాలు చేయ‌నున్నాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat