Home / SLIDER / పనికిమాలినోడు రాజీనామా చేస్తే హుజురాబాద్ లో ఉప ఎన్నికలు

పనికిమాలినోడు రాజీనామా చేస్తే హుజురాబాద్ లో ఉప ఎన్నికలు

పనికిమాలినోడు రాజీనామా చేస్తే హుజురాబాద్ లో ఉప ఎన్నికలు వచ్చాయని ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మండిపడ్డాడు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘అధికారంలో ఉండి.. మంత్రిగా ఉండి ఈటెల ఏ పని చేయలేదు. మంత్రి పదవి భర్తరఫ్ చేయగానే.. అవసరం లేకున్నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. ఈటెల రాజేందర్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. గొర్రెలను కొన్నట్టు ప్రజాప్రతినిధులను కొంటున్నారని.. బెదిరిస్తున్నారని ఈటెల అంటున్నాడు. కారు గుర్తునే నాది అనే పిచ్చి ప్రేలాపనలో ఈటల ఉన్నారు. కారు గుర్తు నీది కాదు.. నువ్వు ఒక కార్యకర్తగా మాత్రమే పనిచేశావు.

పాలు పెంచి పోషిస్తే నాగుపామూలా మరి కాటేసేందుకు ప్రణాళికలు అమలు చేశావు. వ్యక్తిగత లబ్ది కోసమే ఈటెల రాజేందర్ రాజకీయం చేశాడు. ఈటెల రాజేందర్ కారు కూతలు కూసేది.. ప్రాణాలు లెక్క చేయకుండా రాష్ట్రాన్ని సాధించిన సీఎం కేసీఆర్ గురించి అనేది మరచిపోవద్దు. బతుకునిచ్చిన నాయకుడి గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు.

ప్రజా ప్రతినిధులు గౌరవం దెబ్బతినేలా ఈటెల మాట్లాడుతున్నాడు. ఈటెల రాజేందర్ పువ్వు గుర్తు మీద గెలవలేదు. తెల్లవారుజామున ఇతర పార్టీల నాయకులతో సమావేశాలు నిర్వహించింది ఈటెల కాదా? తాను ఆరోపిస్తున్నట్టు ఉద్యోగాలు ఎక్కడ తీసేసారో ఈటెల చెప్పాలి. కరోనా సమయంలో తాత్కాలికంగా ఉద్యోగులను తీసుకున్నారు.. ఆనాడు వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఆ జీవో ఇచ్చింది నువ్వు కాదా ఈటెల? నువ్వు పని చేసిన శాఖలపైనే నీకు పట్టు లేదు ఈటెల రాజేందర్.ఈటెలకు మంత్రి హరీష్ రావు, సీఎం కేసీఆర్ కేసీఆర్ గురించి విమర్శించే స్థాయి లేదు. ఈటెల ప్రజలకు చేసిన సాయం చిన్నది.. చెప్పుకున్న గొప్పలు పెద్దగా ఉన్నాయి. ఈటెల రాజేందర్ ను రాజకీయంగా బొంద పెట్టడం ఖాయం. అహంకారం పెరిగి ఈటెల రాజేందర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు.

ఈటెల సన్యాసం తీసుకోవడం కాదు.. నమ్మిన వాళ్లకు ద్రోహం చేయాలని చూసినప్పుడే రాజకీయ సన్యాసం తీసుకున్నావు.. నువ్వు బైరాగి అవకతప్పదు. ఉద్యమకారుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ భారీ మెజారిటీతో గెలవడం పక్కా. ఆత్మాభిమానం ఉన్న ఈటెల.. గడియారాలు, కుంకుమ భరిణలు ఇచ్చింది నిజం కాదా.’’ అని ఎమ్మెల్యే నన్నపనేని ఈటలను ప్రశ్నించాడు..

తప్పు చేసి భర్తరప్ కు గురయ్యాడు.మంత్రి గా ఉండి ఈటెల ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేయలేకపోయాడు. తప్పు చేసి రాజీనామా చేసి గుమ్మడి కాయల దొంగ ఎవరంటే నేను కాదు అన్నట్టు భుజాలు తడుముకుంటున్నాడు..నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు ఈటెల..అందరూ తన వెంట ఉన్నారంటున్నాడు కానీ ప్రజలు,నాయకులు అందరూ కేసీఆర్ గారి నాయకతవ్వాన్ని బలపరుస్తున్నారు..కేసీఆర్ వెంటే ఉంటారు.. ఊహల్లో బ్రతకడం ఆపేసి వాస్తవంలో బ్రతుకు.నాలుగు కోట్ల ప్రజల కలను నిజం చేసింది టీఆర్ఎస్ పార్టీ..ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణా గొప్ప విజయాలు సాదిస్తుంది.
– 20 ఏండ్లుగా ఒక బీసీ నేత ఎదగాలని ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నీకు అవకాశం ఇచ్చారు.పాలు పోసి పెంచితే పామై కాటేయజూసావు..మూడేండ్ల క్రితమే నీ కుట్రలు మొదలు పెట్టావు..

స్వంత లాభం కోసం టీఆర్ఎస్ పార్టీని విశ్చిన్నం చేసే కుట్రలు చేసావు..జీవితం ఇచ్చిన తండ్రి లాంటి కేసీఆర్ గారిని,మంత్రి హరీశ్ రావు గారిపై పిచ్చి కూతలు కూస్తున్నావు..సిగ్గుండే మాట్లాడుతున్నావా ఈటెల..?.- కారు గుర్తుపై గెలిచి కేసీఆర్ గారిని మాటలు అంటున్నావు.నువ్వు పోతే పార్టీకి వచ్చిన నష్టం ఏం లేదు..టీఆర్ఎస్ కు సైనికుల్లా పనిచేసేకార్యకర్తలున్నారు..ఆత్మగౌరం అని బీజేపీలో చేరావు..కానీ తెలంగాణా ఆత్మగౌరవం కాపాడిన టీఆర్ఎస్ వెంటే ప్రజలు ఉంటారు..- అర్థరాత్రి వరకు ప్రజాసేవలో ఉండే గొప్ప నేత హరీశ్ రావు గారు..అర్థరాత్రి దొంగలా వ్యక్తిగత సిబ్బందిని వదిలిపెట్టి ప్రతిపక్ష పార్టీలని కలిసి పార్టీ రహస్యాలు చేరవేసిన దొంగవు నువ్వు..నువ్వు హరీశ్ రావు గారిని విమర్శించడం సిగ్గుచేటు..

కేసీఆర్ గారి నాయకత్వంలో పార్టీ కోసం గొప్ప విజయాలందించిన నేత హరీశ్ రావు గారు. సిద్దిపేట మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రజలకు ఏ సమస్య వచ్చినా,ఎక్కడనుండి తనను కలిసినా ఆపదుందంటే తీర్చే నాయకుడు హరీశ్ రావుగారు..కనీసం నియోజకవర్గ ప్రజలను పట్టించుకోలేని అసమర్థుడవు నీవు ఈటెల.ఉద్యోగాలు తీసేసారు అని పచ్చి అబద్దాలు చేప్తున్నావు,కరోనా సమయంలో పనిచేసిన వాళ్ళను తీసేసారంటున్నాము.ప్రస్టేషన్ లో ఏదేదో మాట్లాడుతున్నావు..- తాత్కాలిక ప్రాతిపదికన కరోనా సమయంలో కొందరిని తీసుకున్నారు. జీవో విడుదల చేసింది కూడా నువ్వు..వారికి వేతనాలు ఇస్తూ ప్రభుత్వం కాపాడుకుంది.. తర్వాత రాబోవు రోజుల్లో వైద్య ఆరోగ్యశాఖలో తీసుకోబోయే ఉద్యోగాల్లో ఇప్పుడు కరోనా టైంలో పనిచేసిన వారికి ప్రధమ ప్రాదాన్యత ఇస్తామని జీవోలో ఉంది ఇప్పుడు నువ్వు దానిపై కూడా పచ్చి అబద్దాలు చెబుతున్నారు..ఈటెలను రాజకీయంగా బొందపెట్టడం ఖాయం..ఈ కార్యక్రమంలో చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు,వైస్ చైర్మన్,కౌన్సిలర్లు,ముఖ్య నాయకులు,ఇతర ప్రతినిదులు పాల్గొన్నారు..