Home / SLIDER / కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఔదార్యం

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఔదార్యం

తల్లిదండ్రులను కోల్పోయి శిథిల ఇంట్లో నివసిస్తున్న అనాథ చిన్నారుల దీనస్థితిపై బుధవారం నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనానికి దాతలు స్పందించారు. చిన్నారులకు తాము అండగా ఉంటామని ముందుకొచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం కొత్తగూడెంకు చెందిన గుర్రం శ్రీనివాసులు- సువర్ణ దంపతులు మృతిచెందటంతో పిల్లలు సోని (14), వినయ్ (10) లు అనాథలయ్యారు.

నాయనమ్మ పార్వతమ్మతో కలిసి శిథిలమైన ఇంట్లో నివసిస్తున్నారు. వీరి దీనస్థితిపై నమస్తేలో వచ్చిన ‘అమ్మానాయినలతో పాటే చనిపోయినా బాగుం డు’ కథనానికి స్పందించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ చిన్నారుల ఇంటి నిర్మాణ బాధ్య త తనదేనని ప్రకటించారు. 2 నెలల్లో నిర్మా ణం పూర్తిచేసి, 3 నెలలకు సరిప డా నిత్యావసరాలు అందజేస్తామని, కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ తరఫున విద్య అందిస్తామని హామీ ఇచ్చారు.

కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశంతో ఎంపీడీవో బండారు యాదగిరి, పంచాయతీరాజ్ ఏఈ సందీప్ చిన్నారుల వద్దకు వెళ్లి ధైర్యం చెప్పారు. టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎస్ ముజీబ్ రూ.10 వేలు, హైదరాబాద్ చెందిన మురళి 2 వేలు, బేగంబజార్ ఏఈ సంపత్ రూ.2500, ఇతరులు రూ.2500, మేడ్చల్ జిల్లా కొంపల్లి మాజీ సర్పంచ్ జెమ్మి దేవేందర్ రూ.3వేలు ఆర్థిక సాయం అందజేశారు. స్పందిం చిన అధికారులు, ప్రజాప్రతినిధులకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat