Home / MOVIES / ‘ఆర్ఆర్ఆర్’ విడుదల మళ్లీ వాయిదా..?

‘ఆర్ఆర్ఆర్’ విడుదల మళ్లీ వాయిదా..?

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న పాన్ ఇండియన్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ హీరోలుగా నటిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మరోసారి పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగా 10 భాషలలో దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్టు ఇంతకముందే ప్రకటించారు. అయితే ఇంకా పోస్ట్‌ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతుండగా, అక్టోబర్ మూడవ వారం వరకు ఇది పూర్తయ్యే అవకాశాలున్నాయట.

అందుకే ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టు..ప్రపంచ సినిమా మార్కెట్ చక్కబడిన తర్వాత వీలయినంత త్వరగా విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇందులో బాలీవుడ్ స్టార్ ఆలియా భట్, అజయ్ దేవగణ్, శ్రీయ శరణ్, బ్రిటన్ మోడల్ ఓలివియా మోరీస్, సముద్రఖని తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నఈ సినిమాని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat