యూపీ సీఎం అభ్యర్థిగా ప్రియాంక గాంధీని ప్రకటిస్తారా..?. వచ్చేడాది చివరలో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ CM అభ్యర్థిగా ప్రియాంక గాంధీ వాద్రాను ప్రకటించే అవకాశాలున్నాయని అంటున్నారు కాంగ్రెస్ వర్గాలు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ నేతృత్వంలో బరిలో దిగనున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ వెల్లడించారు. అయితే, దీనిపై ఇంకా స్పష్టత లేదన్నారు. పార్టీ కోసం ప్రియాంక ఎంతో శ్రమిస్తున్నారని ఖుర్షీద్ చెప్పారు.