Home / SLIDER / నేటినుంచి మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌.

నేటినుంచి మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌.

తెలంగాణ రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరికి టీకా వేసేందుకు గురువారం నుంచి మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్టు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. గ్రామస్థాయిలో వ్యాక్సిన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ప్రభుత్వం చేపట్టే స్పెషల్‌ డ్రైవ్‌లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌పై బుధవారం హనుమకొండ జిల్లాకేంద్రం నుంచి జిల్లాల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రోజూ మూడులక్షల మం దికి వ్యాక్సిన్‌ ఇచ్చేలా స్పె షల్‌ డ్రైవ్‌ చేపట్టాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పూర్తి నియంత్రణలో ఉన్నదని చెప్పారు. రాష్ట్రంలో 18 సంవత్సరాల పైబడినవారు 2.80 కోట్ల మంది ఉన్నారని, వారిలో ఇప్పటికే రెండు కోట్ల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చినట్టు వెల్లడించారు. మహిళా సంఘాలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసి.. ప్రతి ఒక్క రూ వ్యాక్సిన్‌ తీసుకునేలా చూడాలని పేర్కొన్నారు.

వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో బాగా పనిచేసినవారికి జిల్లా, మండల, గ్రామస్థాయిలో అవార్డులు ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ మాట్లాడుతూ జిల్లా అధికారులు వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌పై నిరంతరం సమీక్షించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, సీడీఎంఏ ఎన్‌ సత్యనారాయణ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ ఏ శరత్‌, డీఎంహెచ్‌ శ్రీనివాస్‌రావు, డీఎంఈ రమేశ్‌రెడ్డి, సీఎం ఓఎస్డీ గంగాధర్‌, టీఎస్‌ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సబ్‌ సెంటర్‌..
వార్డు యూనిట్‌గా ప్రణాళిక
మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌కు కలెక్టర్లు నేతృత్వం వహించనున్నారు. ఈ డ్రైవ్‌లో రోజుకు మూడు లక్షల డోసుల చొప్పున రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ టీకాలు వేయనున్నట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. డ్రైవ్‌లో చేపట్టాల్సిన కార్యక్రమాలు, సూచనలను బుధవారం జారీచేసింది.

గ్రామీణ ప్రాంతాల్లో సబ్‌సెంటర్‌, పట్టణ ప్రాంతాల్లో వార్డు యూనిట్‌గా వ్యాక్సినేషన్‌ ప్రణాళిక రచించాలి.
ఇంటింటి సర్వే చేపట్టి ఇంట్లో ఎంతమంది అర్హులు ఉన్నారు? ఎంత మంది టీకాలు వేసుకున్నారో గుర్తించాలి. టీకాలు వేసుకోనివారిని క్యాంపునకు తరలించాలి. పూర్తి వివరాలతో ఆ ఇంటికి స్టిక్కర్‌ వేయాలి.
వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయిన కాలనీలను ప్రత్యేకంగా ప్రకటించాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat