తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి అక్టోబర్ నెల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఈ నెల 23న తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. 23న ఉ.9 గంటల నుంచి టికెట్లను వెబ్సైటులో అందుబాటులో ఉంచనుండగా.. రోజుకు 8వేల టికెట్లను జారీ చేయనుంది.
అలాగే ఈ నెల 24వ తేదీ నుంచి సర్వదర్శనం(ఉచిత దర్శనం) టోకెన్లను ఆన్లైన్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం జారీ చేయనున్నది.. తిరుపతిలో ఆఫ్ లైన్ లో ఇస్తున్న సర్వదర్శన టోకెన్లను 23 నుంచి నిలిపివేయనుంది.