Home / SLIDER / అక్టోబర్‌ 25 నుంచి నవంబర్‌ 2 వరకు ఫస్టియర్‌ పరీక్షలు

అక్టోబర్‌ 25 నుంచి నవంబర్‌ 2 వరకు ఫస్టియర్‌ పరీక్షలు

కొవిడ్‌ ఉద్ధృతి నేపథ్యంలో వాయిదా పడిన తెలంగాణలోని ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల నిర్వహణపై ఇంటర్‌బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది మే 5 నుంచి జరగాల్సిన ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలను వాయిదావేసి.. విద్యార్థులందరినీ పైతరగతులకు ప్రమోట్‌చేసింది. అప్పట్లో ఫస్టియర్‌లో 4.35 లక్షల మంది పరీక్ష ఫీజు చెల్లించారు. ప్రస్తుతం సెకండియర్‌లో ఉన్న వీరందరికీ అక్టోబర్‌ 25 నుంచి నవంబర్‌ 2 వరకు ఫస్టియర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఇంటర్‌బోర్డు ప్రకటించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ శుక్రవారం ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు.

పరీక్షల షెడ్యూల్‌

తేదీ పేపర్‌
25-10-21 ద్వితీయభాష
26-10-21 ఇంగ్లిష్‌
27-10-21 గణితం పేపర్‌ -1ఏ, బోటనీ, పొలిటికల్‌ సైన్స్‌
28-10-21 గణితం పేపర్‌ -1బీ, జువాలజీ, హిస్టరీ
29-10-21 భౌతికశాస్త్రం, అర్థశాస్త్రం
30-10-21 రసాయనశాస్త్రం, వాణిజ్యశాస్త్రం
1-11-21 పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, బ్రిడ్జికోర్సు గణితం (బైపీసీ విద్యార్థులకు)
2-11-21 మోడ్రన్‌ లాంగ్వేజ్‌, జియోగ్రఫీ

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat