Home / MOVIES / కేజీఎఫ్ 2 విడుదల తేదిపై క్లారిటీ

కేజీఎఫ్ 2 విడుదల తేదిపై క్లారిటీ

సౌత్ ఇండ‌స్ట్రీ స్థాయి పెరిగింది. భారీ బడ్జెట్ చిత్రాలు రూపొందుతుండ‌గా, ఇవి ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. ఎలాంటి అంచ‌నాలు లేకుండా క‌న్న‌డ‌లోరూపొందిన కేజీఎఫ్ చిత్రం ఎంత సెన్సేష‌న్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.ప్ర‌శాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరో గా, శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా వచ్చిన ఈ చిత్రం కేవలం కన్నడ లో మాత్రమే కాకుండా, విడుదల అయిన అన్ని ప్రాంతాల్లో తన సత్తా చాటి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది.

ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా కేజీఎఫ్ 2 రూపొందుతుంది.కేజీఎఫ్ 2 చిత్రాన్ని ప్రశాంత్ నీల్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించాడు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ అధీరా అనే పాత్ర‌లో న‌టిస్తున్నారు.

భారీ తారాగ‌ణంతో రూపొందుతున్న ఈ చిత్రం క‌రోనా వ‌ల‌న వాయిదా ప‌డుతూ వ‌స్తుంది. అయితే కొద్ది రోజుల క్రితం ఓ పోస్ట‌ర్ విడుద‌ల చేసి ఏప్రిల్ 14, 2022 న సినిమాని విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. అయితే వచ్చే ఏడాది వరుస సినిమాలు విడుదల కానున్న నేపథ్యం లో కేజీఎఫ్ చాప్టర్ 2 విడుదల తేదీ మారనుంది అంటూ పలు వార్తలు వచ్చాయి. దీనిపై మేక‌ర్స్ క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. చెప్పిన తేదీకే మూవీ విడుద‌ల కానుంద‌ని తెలియ‌జేశారు.