మనమంతా జాతిపిత మహాత్మాగాంధీ అడుగుజాడల్లో నడిచి రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఆయన జడ్చర్ల పట్టణంలోని పలు కూడళ్లలో గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసిఆర్ కూడా గాంధీజీ మార్గంలోనే నడుస్తున్నారని చెప్పారు.కేసీఆర్ అహింసా మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఏడేండ్లుగా తెలంగాణలో శాంతియుత వాతావరణం నెలకొని ఉందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు.
అనంతరం గాంధీ జయంతి సందర్భంగా శ్రీ సత్యేశ్వర సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.