‘‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఓటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అని రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఎందురుచూశారు. ఓటర్లు స్ఫూర్తిదాయకమైన తీర్పు ఇచ్చారు. అందరికీ అభినందనలు’’ అంటూ తెలంగాణ రాష్ట్ర భాజాపా అధ్యక్షుడు జండి సంజయ్ ట్వీట్ చేశారు.
‘మా’ అధ్యక్షుడిగా గెలిచిన విష్ణు సహా ఇరు ప్యానళ్ల విజేతలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ‘‘జాతీయవాద వ్యతిరేక శక్తుల్ని చిత్తుగా ఓడించిన ‘మా’ ఓటర్లకు ధన్యవాదాలు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే గ్యాంగ్‌కు మద్దతు పలికిన వారికి సరైన గుణపాఠం ఇది’’ అని ఆయన పేర్కొన్నారు.