Home / HYDERBAAD / గాంధీ దవాఖానలో అగ్ని ప్రమాదం

గాంధీ దవాఖానలో అగ్ని ప్రమాదం

సికింద్రాబాద్‌లోని గాంధీ దవాఖానలో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్‎ కారణంగా దవాఖాన నాలుగో అంతస్తులోని విద్యుత్‌ ప్యానెల్‌ బోర్డులో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. మంటలను గమనించిన హాస్పిటల్‌ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

అగ్ని ప్రమాదంతో దవాఖానలోని పలు వార్డుల్లోకి పొగ వ్యాపించింది. దీంతో రోగులు శ్వాస తీసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అప్రమత్తమైన సిబ్బంది ముందు జాగ్రత్త చర్యగా పలు వార్డుల్లోని రోగులను బయటికి పంపేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ ప్రమాదం వల్ల దవాఖానలో కరెంటు తీగలు దగ్ధమయ్యాయని, త్వరలోనే వాటిని పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.