Home / SLIDER / ఈటల కాంగ్రెస్ గూటికెళ్లడం ఖాయమా..?

ఈటల కాంగ్రెస్ గూటికెళ్లడం ఖాయమా..?

హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున బరిలోకి దిగుతున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ త్వరలోనే కాంగ్రెస్ లో చేరడం ఖాయమా..?.ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఈటల చేరికపై టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డిని కల్సి క్లారిటీచ్చారా..?. ఈ నెల ముప్పై తారీఖున జరగనున్న ఉప ఎన్నికల్లో ఈటల గెలిచిన ఓడిన తర్వాత కొన్ని రోజుల తర్వాత కాంగ్రెస్ లో చేరడం ఖాయమా అంటే అవుననే అనాలి.

మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డికి గోల్కొండ రిసార్టులో కల్సి హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తనకు మద్ధతుగా పని చేయాలని.. గెలిచిన ఓడిన తర్వాత కాంగ్రెస్ లో చేరతాను అని హామీచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్,బీజేపీ పార్టీలు చీకటి ఒప్పందం చేసుకున్నాయి.

దీనికి సంబంధించి ఉమ్మడి అభ్యర్థిగా ఈటలను నిలబెట్టినట్లు ఆర్ధమవుతుంది. ఈ రెండు పార్టీలు ఓట్ ట్రాన్స్ ఫర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వీళ్లు కలిశారు. దానికి సంబంధించిన ఫోటోలను విడుదల చేస్తాను. దమ్ముంటే ఇది నిజం కాదని నిరూపిస్తారా అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసరడంతో పైవార్తలన్నింటికి బలం చేకూరుస్తుంది.