Home / MOVIES / త్రివిక్రమ్ దర్శకత్వంలో Style Star

త్రివిక్రమ్ దర్శకత్వంలో Style Star

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబో మళ్ళీ రిపీట్ కాబోతోందని తాజాగా బిగ్ అప్‌డేట్ వచ్చింది. వీరి కాంబోలో వచ్చిన గత చిత్రం ‘అల వైకుంఠపురములో’ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీ మ్యూజిక్ కూడా పెద్ద సెన్షేషనల్ హిట్‌గా నిలిచింది.

హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌లో చినబాబు నిర్మించారు. అలాంటి కాంబోలో మళ్ళీ సినిమా అంటే అందరిలోనూ ఉండే ఆ అంచనాలు వేరే లెవల్. త్వరలో ఇదే కాంబినేషన్‌లో మళ్ళీ ఓ భారీ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ రానుందని టీమ్ వెల్లడించింది.

ఈ మేరకు త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్, నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ కలిసి ఉన్న ఓ పిక్‌ను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ అనే పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నాడు. దీని ఫస్ట్ పార్ట్ ఈ ఏడాది డిసెంబర్ 17న 5 భాషలలో రిలీజ్ కానుంది. రష్మిక మందన హీరోయిన్.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat