తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ధాన్యం కొంటుంటే.. బీజేపీ నేతలు ధర్నాల పేరుతో డ్రామాలాడుతున్నారని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. ధర్నాలు ఇక్కడ కాదు ఢిల్లీలో చేయాలని సూచించారు.
తాము వడ్లు కొంటున్నామని, బియ్యం కొనాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 6,663 కేంద్రాలను ఏర్పాటు చేసి వానాకాలం పంట ప్రతి గింజను కొంటామని చెప్పారు. యాసంగి పంట మొత్తం కేంద్రమే కొనాలని డిమాండ్ చేశారు.