కోవిడ్ వ్యాక్సిన్ కు సంబంధించి గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ తీసుకునే అర్హత కలిగి ఉండి, ఇప్పటి వరకు మొదటి, రెండో డోస్ తీసుకోని వారిపై కఠిన నిబంధనలు అమలు చేయనున్నట్లు ప్రకటించింది.
వారికి పబ్లిక్ ప్లేస్ కి అనుమతి నిషేధించింది. బస్సుల్లో ఎక్కడానికి అనుమతి లేదని ప్రకటించింది. వివిధ ప్రదేశాల్లోకి ప్రవేశించే ముందు కోవిడ్ సర్టిఫికేట్ తనిఖీ చేస్తామని తెలిపింది.