తెలంగాణ రాష్ట్రంలోని ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద అధికార టీఆర్ఎస్ పార్టీ మహాధర్నా నిర్వహించనుంది.
ఈ మహాధర్నాలో గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఉ. 11గం.- మ. 2గం. వరకు ధర్నాచౌక్ పార్టీ ముఖ్యనేతలంతా బైఠాయించనున్నారు. ధర్నా అనంతరం రాజ్ భవన్ కి వెళ్లి గవర్నర్ తమిళ సై కి వినతి పత్రం సమర్పించనున్నారు. ఈ నిరసన తర్వాత కేంద్రం స్పందన చూసి తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.