Home / SLIDER / మా వడ్లు కొంటరా.. కొనరా? సేకరణపై స్పష్టతనివ్వండి

మా వడ్లు కొంటరా.. కొనరా? సేకరణపై స్పష్టతనివ్వండి

ఏడాదికి తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంత బియ్యం కొనుగోలు చేస్తారో స్పష్టతనివ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు డిమాండ్‌ చేశారు. బుధవారం ప్రధానికి రెండు పేజీల లేఖను రాసిన కేసీఆర్‌..

వ్యవసాయరంగం బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న చర్యలు, పెరిగిన దిగుబడి గురించి వివరించారు. అదే సమయంలో దేశంలో ఆహార భద్రత కల్పనలో కేంద్రం బాధ్యతను విస్మరించరాదని పేర్కొన్నారు. ఈ లేఖను కేంద్ర ఆహార, పౌర సరఫరాలశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌కు కూడా పంపించారు. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) అసంబద్ధ, అయోమయ విధానాలు రాష్ర్టాలకు ప్రతిబంధకంగా మారాయన్నారు. ఏ పంటలు వేయాలో రైతులకు వివరించే పరిస్థితి లేకుండా పోయిందని పేర్కొన్నారు.

ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ రాసిన లేఖ పూర్తి పాఠం..

తెలంగాణ ఏర్పడిన 2014 నుంచి, వ్యవసాయరంగంలో అద్భుతమైన అభివృద్ధిని సాధించిందనేది మీకు తెలిసిన విషయమే. వినూత్న విధానాలతో తెలంగాణ ప్రభుత్వం అమలుపరుస్తున్న వరుస పథకాల మూలంగానే వ్యవసాయం దృఢంగా తయారై ఇంతటి అభివృద్ధి సాధ్యమైంది. 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తును పూర్తి ఉచితంగా అందిస్తూ, ఏడాదికి ఎకరానికి 10,000 రూపాయల పంట పెట్టుబడి ప్రోత్సాహకాన్ని తెలంగాణ రైతుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. కష్టజీవి అయిన తెలంగాణ రైతు.. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను అందిపుచ్చుకుంటూ, గుణాత్మకంగా దిగుబడిని సాధిస్తున్నాడు. తద్వారా దేశ ప్రగతికి దోహదం చేస్తున్నాడు.
తెలంగాణ ఏర్పాటుకు ముందు, ఎకడ చూసినా తెలంగాణలో కరువు కాటకమే తాండవించేంది. నేడు రాష్ట్రంలో గణనీయంగా పెరిగిన సాగునీటి లభ్యత ద్వారా, తెలంగాణ తన అవసరాలను దాటుకొని ఆహార ధాన్యం దిగుబడిలో మిగులు రాష్ట్రంగా నిలిచింది. తెలంగాణ రైతు నేడు దేశానికే అన్నపూర్ణగా ఎదిగిన ప్రగతి ప్రస్థానం గురించి మీకు తెలియనిది కాదు. సురక్షిత నిల్వలను కొనసాగిస్తూ, ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం, గోధుమలు వంటి ఆహార ధాన్యాలను పంపిణీ చేస్తూ.. దేశ ప్రజలకు ఆహార భధ్రతను కల్పించే తప్పనిసరి బాధ్యతలను నెరవేర్చాల్సిన భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) అసంబద్ధ విధానాలను అవలంబిస్తూ, అటు రైతులను ఇటు రాష్ట్ర ప్రభుత్వాలను అయోమయానికి గురి చేస్తున్నది.

ఎఫ్‌సీఐ అవలంబిస్తున్న అయోమయ విధానాలు ఏమిటంటే..

1.ఏడాదికి సరిపడా బియ్యం సేకరించే లక్ష్యాలను ఒకేసారి నిర్ధారించడం లేదు.
2.ప్రతి ఏటా ధాన్యం దిగుబడి పెరుగుతున్నదని తెలిసినా బియ్యాన్ని వేగంగా సేకరించడం లేదు.
ఈ విధానాల వల్ల సరైన పంటల విధానాన్ని రైతులకు వివరించేందుకు రాష్ట్రాలకు ప్రతిబంధకంగా మారింది. ఉదాహరణకు, 2020-21 వానకాలం సీజన్‌లో తెలంగాణలో 55.75 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం దిగుబడి అయింది. అందులో 32.66 లక్షల టన్నులను మాత్రమే ఎఫ్‌సీఐ సేకరించింది. పండిన పంటలో ఇది 59% మాత్రమే. 2019-20 వానకాలంలో సేకరించిన బియ్యం కంటే 78% తకువ. బియ్యం సేకరణలో ఇంత విపరీత తేడాలుంటే రాష్ట్రంలో హేతుబద్ధమైన పంట విధానాల అమలు ఇబ్బందిగా మారుతుంది. ఇటువంటి అయోమయ పరిస్థితులను తొలగించి బియ్యం సేకరణలో నిర్దిష్టమైన లక్ష్యాన్ని నిర్ధారించడం కోసం కేంద్ర ఆహార పౌర సరఫరాలశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ను సెప్టెంబర్‌ 25, 26 తేదీల్లో స్వయంగా వెళ్లి కలిశాను. వార్షిక బియ్యం సేకరణ లక్ష్యాన్ని తక్షణమే నిర్ధారించాలని విజ్ఞప్తి చేశాను. 50 రోజులు దాటిపోయినా ఎటువంటి సమాచారం లేదు, ఇంతవరకు విధాన నిర్ణయాన్ని తీసుకోలేదు.

ఎఫ్‌సీఐకి ఈ కింది ఆదేశాలు ఇవ్వాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను.

  1. 2020- 21 ఎండాకాలం సీజన్‌లో సేకరించకుండా మిగిలిన 5 లక్షల టన్నుల బియ్యాన్ని వెంటనే
    సేకరించాలి.
    2.40 లక్షల టన్నుల బియ్యం సేకరించడమనే నిబంధనను మరింతగా పెంచి,
    పంజాబ్‌లో మాదిరి తెలంగాణలో కూడా 2021 -22 వానకాలంలో పండిన పంటలో 90% బియ్యాన్ని సేకరించాలి.
  2. వచ్చే యాసంగిలో తెలంగాణలో కేంద్రం ఎంత బియ్యం కొంటుందో ముందుగానే నిర్ధారించాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat