Home / ANDHRAPRADESH / బాబుకు ముద్రగడ ఘాటు లేఖ

బాబుకు ముద్రగడ ఘాటు లేఖ

ఏపీ మాజీ సీఎం ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ‘మీరు ఏడవడం చూసి ఆశ్చర్యపోయా. మీ కంటే మా కుటుంబానికి చాలా చరిత్ర ఉంది.

కాపు ఉద్యమ టైంలో దీక్ష చేపట్టిన నన్ను, నా కుటుంబసభ్యులను పోలీసులతో బూతులు తిట్టించారు. మరి మీ శ్రీమతి గారు దేవతా? మీరు చేసిన హింసకు నిద్రలేని రాత్రులు గడిపాం. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. కానీ మీ పతనం నా కళ్లతో చూడాలనే ఉద్దేశంతో ఆత్మహత్య విరమించుకున్నాను’ అని తెలిపారు.