Apలోని కర్నూలు జిల్లాలో అంగన్ వాడీ టీచర్ పోస్టుకు ఓ యువతి దరఖాస్తు చేసుకుంది. కలెక్టరేట్లో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ యువతి నెంబర్ తీసుకుని.. ఉద్యోగం కావాలంటే చెప్పింది చేయాలని వేధించడం మొదలుపెట్టాడు.
ఓ ఉన్నతాధికారితో ఏకాంతంగా గడిపితే ఉద్యోగం వస్తుందన్నాడు. అప్రమత్తమైన బాధితురాలు కాల్ రికార్డ్ చేసి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లింది. ఆయన విచారణకు ఆదేశించారు. జూనియర్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేశారు.