తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్‌కు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఘనంగా నివాళులు అర్పించారు.
బిపిన్ రావత్, ఆయన సతీమణి మధూలిక రావత్ భౌతిక కాయాలపై పుష్పగుఛ్చాలుంచి అంజలి ఘటించారు. అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ కూడా బిపిన్ రావత్ దంపతులకు నివాళులు అర్పించారు.