యూకేలో కరోనా మహమ్మారి తీవ్రం రూపం దాల్చింది. ఇవాళ ఒక్కరోజే ఆ దేశంలో ఏకంగా 78,610 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ మొదలైనప్పటి నుంచి దేశంలో ఒకే రోజు ఇన్ని కేసులు రావడం ఇదే అత్యధికం.
మరోవైపు కరోనా కారణంగా 165 మంది మరణించారు. ఇప్పటి వరకు యూకేలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,46,791కి చేరింది. ఇదిలా ఉండగా.. 10,017 ఓమిక్రాన్ వేరియంట్ కేసులతో దేశం వణికిపోతోంది.