సినిమా ఇండస్ట్రీకి చెందిన ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం పుష్ప ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా రూ.144.90 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.101.75 కోట్లు జరిగినట్లు తెలుస్తోంది.
టాలీవుడ్లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదు చేసిన చిత్రాల జాబితాలో ‘పుష్ప’ 4వ స్థానంలో నిలిచింది. ఈ మూవీ కంటే ముందు వరుసలో బాహుబలి 2, సాహో, సైరా నరసింహారెడ్డి ఉన్నాయి. అయితే బాహుబలి 1 రికార్డును ‘పుష్ప’ అధిగమించిందని ట్రేడ్ వర్గాలు చెప్పాయి.