దేశంలో ఉన్న బీసీ కులాల జన గణన సాధ్యం కాదని కేంద్రప్రభుత్వం ప్రకటించడంపై TPCC చీఫ్, MP రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దేశ జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీ కులాల జన గణన చేయడానికి కేంద్రంలోని మోదీ సర్కారు తిరస్కరించడం అంటే ఆ వర్గాలకు తీవ్ర అన్యాయం చేయడమే. బీసీలపై బీజేపీ ప్రేమ కొంగజపం-దొంగజపం అని దీన్ని బట్టి అర్థమవుతోంది. బీసీల మనోభావాలను గౌరవించని బీజేపీ మూల్యం చెల్లించకతప్పదు’ అని ట్వీట్ చేశారు.
Tags anumula revanth reddy bc janaganana bjp bjp governament congress Modi revanth reddy slider Sonia Gandhi telanganapradesh committe tpcc