డెల్టా కంటే ఒమిక్రాన్ వేరియంట్లో స్వల్ప లక్షణాలే ఉన్నాయని, కానీ ఇది దాని కంటే వేగంగా వ్యాపించగలదని ఒమిక్రాన్‌ను తొలిసారి గుర్తించిన సౌతాఫ్రికా వైద్యురాలు ఏంజెలిక్ కోట్టీ అన్నారు.
తాను ఇప్పటివరకు ఒమిక్రాన్ సోకిన వందమందికి చికిత్స చేశానని, సౌతాఫ్రికాలో తీవ్రమైన కేసులు లేవన్నారు. కాగా, కోట్టీ ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించి ఆ దేశ వైద్యారోగ్య శాఖను వెంటనే అప్రమత్తం చేశారు.