సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ అదరగొడుతున్నాడు. సఫారీ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సౌతాఫ్రికాలో టెస్టుల్లో సెంచరీ చేసిన రెండో భారత ఓపెనర్ గా రాహుల్ రికార్డు సృష్టించాడు.
ఇంతకుముందు 2007లో వసీమ్ జాఫర్ కేప్ టౌన్లో సెంచరీ బాదాడు. అలాగే టెస్టుల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికాలో సెంచరీ చేసిన తొలి భారత ఓపెనర్‌గా రికార్డు సృష్టించాడు.