ఏపీ అర్హులుగా ఉండి సంక్షేమ పథకాల లబ్ధి పొందని వారికి ఏపీ ప్రభుత్వం తీపికబురు అందించింది. అలాంటి 18.48లక్షల మంది అకౌంట్లలో పథకాలకు సంబంధించి రూ.703 కోట్లను జమ చేయనున్నట్లు పేర్కొంది.
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జగన్ నగదును జమ చేయనున్నారు. ఇకపై అర్హులుగా ఉండి.. ఏదైనా కారణం చేత సంక్షేమ పథకాలు అందని వారికి ఏటా జూన్, డిసెంబర్లో లబ్ధి చేకూరుస్తామంది.