ఇటీవల కరోనా బారిన పడిన మాజీ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉందని కోల్కతాలోని వుడ్అండ్ ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది.
ప్రస్తుతానికి ఆయనకు జ్వరం లేదని తెలిపింది. నిపుణులైన వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారని, భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. గంగూలీకి కొన్ని నెలల కిందట యాంజియోప్లాస్టీ జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన కోవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్నారు.