తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కరోనా కేసుల పెరుగుదల ఆందోళన కల్గిస్తోంది. మరోసారి భారీగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 42,531 టెస్టులు చేయగా 1,520 పాజిటివ్ కేసులు వచ్చాయి.
నిన్నటితో (1,052) పోలిస్తే ఏకంగా 500 కేసులు ఎక్కువగా వచ్చాయి. ప్రస్తుతం 6,168 యాక్టివ్ కేసులుండగా, కరోనాతో ఒకరు మరణించారు. అయితే ఇవాళ ఒమిక్రాన్ కేసులేవీ రాలేదని వైద్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 94గా ఉంది.