దక్షిణాఫ్రికా, ఇండియా మధ్య కేప్టాన్ లో జరగాల్సిన టెస్టు మ్యాచ్ లో అజింక్య రహానెకు బదులుగా విహారిని జట్టులో తీసుకోవాలని మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అన్నాడు. రెండో టెస్టుకు కోహ్లి దూరమవడంతో విహారికి అవకాశం ఇచ్చారు.
మూడో టెస్టు కోసం కోహ్లి తిరిగి జట్టులో చేరనున్న నేపథ్యంలో గంభీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. విహారికి కూడా అవకాశాలు ఇవ్వాలని, రహానె ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడని గౌతీ చెప్పాడు.