తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 90,021 టెస్టులు చేయగా కొత్తగా 2,319 మందికి కరోనా నిర్ధారణ అయింది.
నిన్నటితో పోలిస్తే 399 కేసులు పెరిగాయి. మంగళవారం 1,920 కేసులు నమోదయ్యాయి. ఇక మహమ్మారితో ఇద్దరు మరణించారు.
మరోవైపు కరోనా నుంచి 474 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,339 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు గత 24 గంటల్లో GHMC పరిధిలో 1,275 కేసులు వచ్చాయి.