ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన అఖండ మూవీ కలెక్షన్ల సునామీ కొనసాగుతోంది. ఈనెల 20తో ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకోనుంది.
ఈ టైంలో 50 రోజులు పాటు మూవీ రన్ కావడం అంటే మాములు విషయం కాదు. అఖండ విడుదలైన 10 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరి రికార్డు సృష్టించింది.
ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో రూ.73 కోట్లకు పైగా షేర్ (130 కోట్ల గ్రాస్) వసూలు చేసింది. సంక్రాంతి చిత్రాలకు కూడా పోటీ ఇచ్చి రికార్డులు సృష్టించేందుకు సిద్ధమైంది.