ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. లేఖలో.. ‘పెంచిన ఎరువుల ధరలను కేంద్రం తగ్గించాలని కోట్ల మంది రైతుల తరఫున కోరుతున్నా.
ఇప్పటికే అనేక రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారు..
ధాన్యం కొనుగోళ్లు ఆపారు. వ్యవసాయ ఖర్చును విపరీతంగా పెంచారు. రైతులకు విద్యుత్ మీటర్లు పెట్టి వారి ప్రయోజనాలు దెబ్బతీస్తున్నారు’ అని పేర్కొన్నారు.