టీమిండియా పరుగుల మిషన్ విరాట్ కోహ్లి కెప్టెన్సీ వదులుకోవడానికి గల కారణాలను అనేక మంది పలు రకాలుగా చెబుతున్నారు. తాజాగా దక్షిణాఫ్రికా మాజీ పేసర్ స్టెయిన్ తన అభిప్రాయాన్ని చెప్పాడు.
తన కుటుంబానికి అండగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని తెలిపాడు. ప్రస్తుత బయోబబుల్స్ కారణంగా కుటుంబానికి దూరం కావడం ఇబ్బందికరంగా ఉంటుందన్నాడు. కెప్టెన్సీ నుంచి వైదొలిగాక విరాట్ తన కుటుంబం, బ్యాటింగ్‌పై దృష్టి సారిస్తాడని వివరించాడు