ప్రస్తుతం కరోనా వల్ల ‘డోలో 650’ అనే పేరు ప్రపంచమంతటా మారుమోగుతోంది. ‘డోలో 650’ అనేది బ్రాండ్ పేరు. మందు పారాసెటమాల్. 650 ఎంజీ అంటే డోసు. పీ 650, సుమో ఎల్, పారాసిస్, పాసిమోల్, క్రోసిన్ ఇలా. చాలా పారాసెటమాల్ బ్రాండ్లు ఉన్నప్పటికీ ప్రజలందరికీ సుపరిచితమైంది మాత్రం ‘డోలో 650’. కరోనా మొదటి లక్షణం జ్వరం కావడంతో డాక్టర్లు పారాసెటమాల్ వాడాలని సూచిస్తున్నారు. కానీ ప్రజలకు గుర్తుకొచ్చేది మాత్రం డోలో 650నే.