Site icon Dharuvu

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో అఖండ రూ.కోటి కలెక్షన్లు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సినిమా అఖండ. స్టార్ హీరో బాలయ్య నటించిన అఖండ సినిమా బాక్సాఫీస్ దుమ్ము దులిపింది.

కరోనా సెకండ్ వేవ్ కారణంగా బోసిపోయిన థియేటర్లకు పునర్వైభవాన్ని తీసుకొచ్చింది. సినిమాలకు అడ్రస్ అయిన హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఏకంగా రూ.కోటి కలెక్షన్లు రాబట్టింది. ఇటీవల బాలకృష్ణ కూడా అక్కడికి వెళ్లారు. ఇక ఈ చిత్రం ఇప్పటివరకు రూ. 200 కోట్ల గ్రాస్ రాబట్టింది. బాలయ్య కెరీర్లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.

Exit mobile version