తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా పెద్దమందడి మం. మద్దిగట్లకు చెందిన యువకులు ఓ మంచి కార్యక్రమం చేపడుతున్నారు. ఊళ్లో ఆడపిల్ల పుడితే రూ.11,116 చొప్పున ఆర్థికసాయం చేస్తున్నారు.
ఇప్పటివరకు మొత్తం 19 మంది ఆడపిల్లలకు రూ.2,11,204లను వారి తల్లిదండ్రులకు అందజేశామని చెప్పారు. దీనికి ‘అభయహస్తం’ అనే పేరు పెట్టారు. ఇందుకోసం గ్రామ యువకులంతా కమిటీగా ఏర్పడి డబ్బు జమచేసుకుంటున్నారు. కొందరు దాతలు కూడా ఈ మంచిపనిలో భాగమవుతున్నారు.