Home / NATIONAL / 2022-23 కేంద్ర బడ్జెట్‌-ధరలు పెరిగేవి..ధరలు తగ్గేవి..ఇవే..?

2022-23 కేంద్ర బడ్జెట్‌-ధరలు పెరిగేవి..ధరలు తగ్గేవి..ఇవే..?

 కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2022-23 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దాదాపు గంటన్నరకు పైగా ఆర్థికమంత్రి బడ్జెట్‌ ప్రసంగం సాగింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం బడ్జెట్‌ అంచనాలు రూ.39 లక్షల కోట్లు అని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. అయితే, ఈ బడ్జెట్‌‌లో తమకు మేలు చేకూర్చే నిర్ణయం వస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూసిన వేతన జీవులకు మాత్రం ఈసారి నిరాశే ఎదురైంది.

ఆదాయపన్ను మినహాయింపులపై ఎలాంటి ప్రకటన రాలేదు. 5జీ సేవలు, ఈ-పాస్‌పోర్ట్, క్రిఫ్టో కరెన్సీపై ట్యాక్స్, డిజిటల్ కరెన్సీ, ఐటీ రిటర్న్స్ దాఖలులో మరో మినహాయింపు, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు డిడక్షన్ పెంపు, విద్యార్థుల కోసం వన్ క్లాస్.. వన్ ఛానల్ మొదలైనవి ఈ బడ్జెట్‌లో కీలక ప్రకటనలుగా నిలిచాయి. ఇక తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రభావంతో కొన్ని వస్తువుల ధరలు పెరిగితే, మరికొన్నింటి ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. అసలు ఏ వస్తువుల ధరలు పెరగనున్నాయి, ఏ వస్తువుల ధరలు తగ్గనున్నాయి అనే విషయాలను ఒకసారి పరిలీస్తే..

ధరలు పెరిగేవి..

* గొడుగులు(దిగుమతి చేసుకునే వాటిపై సుంకం 20 శాతం మేర పెరగనుంది) 

* అలాగే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అన్ని వస్తువులు. ఉదా: ప్లాస్టిక్ ఐటమ్స్, ఫర్టిలైజర్స్, ఐరన్, స్టీల్, మెడికల్ పరికరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆర్గానిక్ కెమికల్స్

ధరలు తగ్గేవి..

* వస్త్రాలు

* నగలు

* మొబైల్ ఫోన్స్

* మొబైల్ ఛార్జర్

* చెప్పులు

* స్టీల్ స్క్రాప్స్

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat