ఇప్పటికే ఇండియాలో అత్యంత సంపన్నుడిగా నిలిచిన గౌతమ్ అదానీ మరో మైలురాయి అందుకున్నారు. 90.1 బిలియన్ డాలర్లతో అదానీ.. ముకేశ్ అంబానీని అధిగమించి ఆసియాలోనే కుబేరుడిగా నిలిచారని ఫోర్బ్స్ వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా పదో స్థానంలో ఉన్నారు. 2008లో ఈయన సంపద 9.3 బిలియన్ డాలర్లుగా ఉండేది. పోర్టులు, పవర్ జనరేషన్, సోలార్ పవర్, వంటనూనెలు, రియల్ ఎస్టేట్, బొగ్గు ఇలా ఎన్నో రకాల వ్యాపారాలు చేస్తోంది అదానీ గ్రూప్.