Home / SLIDER / ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు : మంత్రి తలసాని.

ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు : మంత్రి తలసాని.

ప్రైవేటుకు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది, బలోపేతం చేయనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. శనివారం ఆయన ‘మన బస్తి – మన బడి’ కార్యక్రమంపై మంత్రి మసబ్‌ ట్యాంక్‌లోని కార్యాలయంలో హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీతో కలిసి హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, జీహెచ్‌ఎంసీ మేయర్‌, డిప్యూటీ మేయర్లతో సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మహమూద్‌ అలీతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడమే కాకుండా నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం మన బస్తి – మన బడి కార్యక్రమం చేపట్టిందన్నారు. ఇందుకు రూ.7,289.54కోట్లు ప్రభుత్వం కేటాయించిందని, ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 499 ప్రాథమిక, తొమ్మిది ప్రాథమికోన్నత, 182 ఉన్నత పాఠశాలలున్నాయని తెలిపారు. ఆయా పాఠశాలల్లో 1.25లక్షల విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారన్నారు.

కార్యక్రమం తొలి విడతలో 239 పాఠశాలలను అభివృద్ధి చేస్తామన్నారు. ప్రాధాన్యతా క్రమంలో నియోజకవర్గానికి పది పాఠశాలల చొప్పున అత్యవసరాలున్న పాఠశాలలని గుర్తించాలని అధికారులను ఆదేశించామన్నారు. ఇందులో భాగంగా పాఠశాలలో విద్యార్థుల కోసం విద్యుత్‌ సౌకర్యం, తాగునీరు, సరిపడా ఫర్నిచర్, మరుగు దొడ్ల నిర్మాణం తదితర సౌకర్యాలు, కాంపౌండ్ వాల్, వంటశాల నిర్మాణం, శిధిలావస్థలో ఉన్న తరగతి గదుల స్థానంలో కొత్తవాటి నిర్మాణం వంటి అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు తెలిపారు. పాఠశాలల్లో డిజిటల్‌ విద్యనందించేందుకు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహకారంతో ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు.

విద్యార్థులను విద్యతో పాటు క్రీడల్లో కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న ఆయన.. కొన్ని పాఠశాలల్లో క్రీడా స్థలాలు లేవన్నారు. అందుబాటులో ఉన్న జీహెచ్‌ఎంసీ స్థలాలను క్రీడాస్థలాలు అభివృద్ధి చేయాలని అవసరం ఉందని పలువురు ఎమ్మెల్యేలు సమావేశం దృష్టికి తీసుకువచ్చారన్నారు. సోమవారం జరుగనున్న ఉపసంఘ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని ప్రభుత్వం పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతుందన్నారు. ఫలితంగా విద్యార్థుల హాజరుశాతం పెరగడంతో పాటు విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారన్నారు. హోంమంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో విద్య ఎంతో ముఖ్యమైందన్నారు.

ప్రభుత్వ విద్యారంగం అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. దాతలు, కార్పోరేట సంస్థ సహకారం, ప్రవాస భారతీయుల సహకారంతో కూడా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్సీలు ఎంఎస్‌ ప్రభాకర్, సురభి వాణిదేవి, స్టీఫెన్ సన్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, మాగంటి గోపినాథ్‌, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, జాఫర్ హుస్సేన్, అహ్మద్ బిన్ బలాల, కలెక్టర్ శర్మన్, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే
శ్రీలత, హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి, ప్రాజెక్ట్ డైరెక్టర్ రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat