ఇప్పటికే తమ దాడులతో రష్యాకు ముచ్చెమటలు పుట్టిస్తున్న ఉక్రెయిన్ కు మద్ధతుగా అమెరికా ,ఈయూ లాంటి దేశాలు అండగా నిలబడుతున్నాయి. ఉన్నకొద్ది పాటి సైన్యంతో రష్యాకు భారీ నష్టాన్ని మిగిలుస్తుంది ఉక్రెయిన్.
ఈ నేపథ్యంలో రష్యా సైన్యం ఉక్రెయిన్ ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగే విధంగా దాడులు చేసింది. దీంతో ఉక్రెయిన్ దేశ ఉప ప్రధాని ఫెడరవ్ సాయం చేయాలంటూ ఎలాన్ మస్క్ కు ట్వీట్ చేశాడు.వెంటనే స్పందించిన ఎలాన్ మస్క్ తన ఫైబర్ నెట్ వర్క్ స్టార్ లింక్ ఉక్రెయిన్ దేశ వ్యాప్తంగా పనిచేసేలా మస్క్ చర్యలు తీసుకున్నారు.
అంత్యంత క్లిష్ట కాలంలో ఉన్న ఉక్రెయిన్ దేశాన్ని ఆదుకుని గొప్ప మనసును చాటుకున్నారు టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ . తమ వ్యూహంలో భాగంగా రష్యా ఉక్రెయిన్ ఇంటర్నెట్ సర్వీసులకు అంతరాయం కలిగిస్తుండటంతో తమ దేశంలో ఏమి జరుగుతుందో తెలియని అయోమయం పరిస్థితుల్లో ఉన్న ఉక్రెయిన్ ప్రజలకు మస్క్ అందించిన సాయం ఎనలేనిది అని నెటిజన్లతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ,ప్రముఖులు కొనియాడుతున్నారు.