Home / MOVIES / పెళ్లి చేసుకోకపోవడానికి అసలు కారణం చెప్పిన ప్రభాస్

పెళ్లి చేసుకోకపోవడానికి అసలు కారణం చెప్పిన ప్రభాస్

సినిమా ఇండస్ట్రీలో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌ లిస్ట్‌లో ప్రభాస్‌ పేరు ప్రథమంగా ఉంటుంది. నలభైరెండేళ్ల వయసున్న ఈ పాన్‌ఇండియా హీరో ఇంకా సింగిల్‌గానే జీవితాన్ని సాగిస్తున్నారు. తాజాగా ఆయన పెళ్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘రాధేశ్యామ్‌’ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ప్రభాస్‌ గురువారం ముంబయి వెళ్లారు.

ట్రైలర్‌ను ఆవిష్కరించిన అనంతరం ఆయన పాత్రికేయులతో ముచ్చటించారు. ఇందులో ప్రభాస్‌ విక్రమాదిత్య అనే హస్తసాముద్రికుడి పాత్రలో కనిపించబోతున్నారు. భవిష్యత్తును ముందుగా ఊహించే అతీంద్రియ శక్తులున్న వ్యక్తిగా ఆయన పాత్రను తీర్చిదిద్దారు. ‘ప్రేమ విషయంలో విక్రమాదిత్య అంచనాలు తప్పాయి’ అనే ట్రైలర్‌లోని సంభాషణను గుర్తుచేస్తూ ఓ విలేకరి ‘మీ నిజ జీవితంలో ప్రేమ విషయంలో అంచనాలు ఎప్పుడైనా తప్పాయా’ అని అడిగారు.

ఈ ప్రశ్నకు ప్రభాస్‌ సమాధానమిస్తూ ‘చాలాసార్లు నా అంచనాలు తప్పాయి. అందుకే నేను పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఉండిపోయా’ అని నవ్వుతూ సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఆయన మాటలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat