నేడు ఉమెన్స్ డే సందర్భంగా హీరోయిన్ పూజా హెగ్డే స్పెషల్‌గా విషెస్ తెలిపారు. ఈ మేరకు ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇందులో ఆమె..ప్రతీ మహిళకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు.
ఈ మహిళా దినోత్సవాన్ని మీ కోసం అంకితం చేసుకోండి అని తెలిపారు పూజా. ఇక ఆమె సినిమాల విషయానికొస్తే, పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ సరసన నటించిన రాధే శ్యామ్ ఈ నెల 11న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. అలాగే, కోలీవుడ్ స్టార్ విజయ్ సరసన నటించిన బీస్ట్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇవి కాకుండా, హిందీతో పాటు తెలుగులో మరికొన్ని చిత్రాలను చేస్తున్నారు.