Home / LIFE STYLE / అసలు ఏడువారాల నగలు అంటే ఏంటో తెలుసా..?

అసలు ఏడువారాల నగలు అంటే ఏంటో తెలుసా..?

సహజంగా అందరూ ఏడువారాల నగలంటారు కదా. ఆ ఏడువారాల నగలు అంటే ఏంటో మీకు తెలుసా…. తెలియదా.. అయితే ఆ ఏడు వారాల నగల కథ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.

ప్రస్తుతం అందరూ ఈ రోజుల్లో గ్రహాల అనుకూలం కోసం వాడుతున్న రాళ్ళ ఉంగరాల మాదిరిగా పూర్వం రోజుల్లో బంగారు నగలు ధరించేవారు అని అందరూ అంటుంటారు. అయితే ఏ వారం ఏ నగలు ధరిస్తారో  తెలుసుకోండి.

1 ఆదివారము – సూర్యుని కోసము కెంపుల కమ్మలు, హారాలు మొదలగునవి.

2 సోమవారము – చంద్రుని కోసము ముత్యాల హారాలు,ముత్యాల గాజులు మొదలగునవి.

3 మంగళవారము – కుజుని కోసము పగడాల దండలు,పగడాల ఉంగరాలు మొదలగునవి.

4 బుధవారము – బుధుని కోసము పచ్చల పతకాలు, గాజులుమొదలగునవి.

5 గురువారము – బృహస్పతి కోసము పుష్యరాగము, కమ్మలు, ఉంగరాలు మొదలగునవి.

6 శుక్రవారము – శుక్రుని కోసము వజ్రాల హారాలు, వజ్రపు ముక్కుపుడక మొదలగునవి.

7 శనివారము – శని కోసము నీలమణిహారాలు మొదలగునవి.

ఇలా ఏడు వారాల నగలు ఏడు రోజులు ధరించిన స్త్రీలకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, అషైశ్వర్యాలు సిద్ధించేలా గ్రహాలు అనుకూలించి ప్రసాధిస్తాయని నమ్మకం. అందుకోసమే 7 వారాల నగలుగా ప్రసిద్ధి చెందాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat