Home / SLIDER / ఆప్ అధినేతకు అరవింద్ కేజ్రీవాల్ కి శుభాకాంక్షలు చెప్పని వాళ్లు వీళ్లే.. ఎందుకు..?

ఆప్ అధినేతకు అరవింద్ కేజ్రీవాల్ కి శుభాకాంక్షలు చెప్పని వాళ్లు వీళ్లే.. ఎందుకు..?

సహజంగా ఏ ఎన్నికల్లో ఏదైనా పార్టీ అనూహ్యంగా భారీ విజయం సాధిస్తే ఆ పార్టీ అధినేతకు ఆ పార్టీ తరపున గెలుపొందిన నేతలకు అభినందనలు వెల్లువెత్తుతాయి.ఇటీవల దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదలైన సంగతి విదితమే. ఈ ఎన్నికల ఫలితాల్లో  పంజాబ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని  మట్టి కరిపించి,అధికారాన్ని దక్కించుకోవాలని ఎన్నో కుట్రలు చేసిన  బీజేపీకి ఏమాత్రం అవకాశం లేకుండా చేసి భారీ మెజారిటీతో ఆమ్‌ఆద్మీ పార్టీ విజయం సాధించిన సంగతి తెల్సిందే.

అయితే ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత ఆం ఆద్మీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌కు విపక్ష నేతలెవరూ శుభాకాంక్షలు చెప్పలేదు అంట. బీజేపీ అంటే గిట్టని నేతలు బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గానీ,  తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ గానీ, జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సొరేన్‌ గానీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే గానీ, కేరళ సీఎం పినరయి విజయన్‌ గానీ, ఒడిసా సీఎం నవీన్‌ పట్నాయక్‌ గానీ కేజ్రీవాల్‌కు అభినందనలు తెలపలేదు.

యూపీలో బీజేపీ విజయం సాధించడం గొప్పేమీ కాదని.. కేంద్ర బలగాలను దించి, ఈవీఎంలను మేనేజ్‌ చేసి అక్కడ కమలనాథులు గెలిచారని విమర్శించిన మమత బెనర్జీ మాత్రం పంజాబ్‌లో ఆప్‌ విజయం గురించి గానీ అధినేత ,ఢిల్లీ సీఎం అయిన కేజ్రీవాల్‌ గురించి గానీ ఏమీ మాట్లాడలేదు. అయితే నిన్న శుక్రవారం ఫలితాలు వెలువడిన తర్వాత పినయి విజయన్‌, ఓ వంతెన ప్రారంభోత్సవం గురించి ట్వీట్‌లో రాసినా ఆప్‌ విజయంపై అక్షరం ముక్క కూడా రాయలేదు. ఒరియా భాషకు కళాత్మక భాషగా గుర్తింపు దక్కడంపై ఒడిసా సీఎం నవీన్‌ పట్నాయక్‌ ట్వీట్‌ చేసినా ఆప్‌ విజయం గురించి మాట మాత్రమైనా రాయలేదు. 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat