ఒకపక్క బుల్లితెరపై అందాలను ఆరబోస్తూ నెంబర్ వన్ యాంకర్ గా రాణిస్తోన్న బ్యూటీ స్టార్ అనసూయ. మరోవైపు సినిమాల్లో మెయిన్ పాత్రల్లో నటిస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది ముద్దుగుమ్మ.
తాజాగా జయ శంకర్ అనే దర్శకుడు తెరకెక్కించబోతున్న ఒక సినిమాలో అనసూయ కామెడీ పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ వస్తున్నట్లు తెలిసింది.
కీలకపాత్రల్లో శ్రీనివాస్ రెడ్డి, చమ్మక్ చంద్రలు నటించబోతున్నారట. లేడీ లీడ్ రోల్ ను హాట్ బ్యూటీ అనసూయ చేస్తోందని సమాచారం. దీంతో ఆమె ప్రేక్షకులను ఏవిధంగా నవ్విస్తుందో అని సినిమాపై ఆసక్తి నెలకొంది.