బాలీవుడ్ కు చెందిన సీనియర్ నటి..హీరోయిన్ శిల్పాశెట్టి తల్లి సునందకు రూ.21 లక్షల రుణాన్ని తిరిగి చెల్లించలేదనే ఆరోపణలపై ముంబై కోర్టు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2015లో శిల్పాశెట్టి తండ్రి సురేంద్ర డబ్బు అప్పుగా తీసుకున్నాడని ఓ వ్యాపారి కేసు పెట్టాడు.. అంతకుముందు సునంద, శిల్ప, ఆమె సోదరి షమితకు కోర్టు సమన్లు జారీ చేసింది. పోర్నోగ్రఫీ కేసులో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ఇప్పటికే నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.