ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ .. అందాల రాక్షసి రష్మికా మందాన్న హీరోయిన్ గా సునీల్ ,అనసూయ,రావు రమేష్ తదితరులు ప్రధాన పాత్రలో నటించగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన మూవీ ‘పుష్ప’ ఎంత సక్సెస్ అయిందో మనకు తెల్సిందే..
రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం మ్యూజిక్ ఆల్బమ్ కూడా అదే రేంజ్ లో ఆకట్టుకుంది. ముఖ్యంగా సమంత స్టెప్పులేసిన ‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ’ పాట మాత్రం యూట్యూబ్లో రికార్డులు క్రియేట్ చేస్తోంది.
ఈ పాట 200 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకొంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ ను షేక్ చేస్తుంది.