Home / MOVIES / దుల్కర్‌కు షాక్.. థియేటర్లలో ఆయన మూవీలపై బ్యాన్

దుల్కర్‌కు షాక్.. థియేటర్లలో ఆయన మూవీలపై బ్యాన్

మహానటి సినిమాలో సావిత్రి భర్తగా నటించి అందరి మన్ననలు పొందిన స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌పై బ్యాన్‌ విధించింది కేరళ థియేటర్స్‌ అసోసియేషన్‌. ఈ మలయాళీ హీరో నటించిన మూవీస్ కేరళలోని థియేటర్లలో ఇకపై రిలీజ్ చేయకూడదని నిర్ణయించింది. ఈమధ్య దుల్కర్ మూవీ ‘సెల్యూట్‌’ ఓటీటీలో విడుదల అయింది. అదే ఈ నిర్ణయానికి కారణం.
‘సెల్యూట్‌’సినిమాకి ఆండ్రూస్ దర్శకత్వం వహించారు. ఇదో క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ. ఫస్ట్ సంక్రాంతికి రిలీజ్ చేస్తామని చెప్పారు. దీంతో నిర్మాణ సంస్థ వేఫేరర్ ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూటర్స్‌తో చర్చలు జరిపింది. సరిగ్గా అప్పుడే కరోనా థర్డ్ వేవ్ రావడంతో రిలీజ్ డేట్ వాయిదా పడింది. పరిస్థితులు చక్కబడితే ప్రేక్షకుల ముందుకు వస్తామని టీమ్‌ ప్రకటించింది. కానీ ‘సెల్యూట్‌’ని థియేటర్లలో కాకుండా డైరెక్ట్‌ ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు టీమ్‌ ప్రకటించింది. ఈ ప్రకటన పట్ల కేరళ థియేటర్‌ అసోసియేషన్‌
అభ్యంతరం తెలిపింది. ఈ సినిమా థియేటర్‌ రిలీజ్‌కు సంబంధించి తమతో నిర్మాణ సంస్థ ఒప్పందం కుదుర్చుకుందని, కానీ ఇప్పుడు మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఓటీటీలో విడుదల చేయడం బాగోలేదని అసోసియేషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆయన సినిమాలు థియేటర్లో విడుదల చేయకూడదని నిర్ణయించింది థియేటర్స్‌ అసోసియేషన్‌.

MOST RECENT

Facebook Page

Advertisement

medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar