ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు చెందిన స్టార్ క్రికెటర్, స్టార్ బ్యాట్స్ మెన్,ఐపీల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కి ప్రాతినిథ్యం వహిస్తున్న స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ ఒక ఇంటివాడయ్యాడు.
ఇందులో భాగంగా ఇండియా సంతతికి చెందిన తన ప్రేయసీ అయిన వినీ రామన్ను నిన్న శుక్రవారం పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహానికి సంబంధించిన పెళ్ళి ఫోటోలను ఈ కొత్త జంట తమ తమ ఇన్ స్టాగ్రామ్ ద్వారా తమ అభిమానులతో పంచుకున్నారు.ఈ క్రమంలో కొత్త జంట అయిన వినీ, మాక్స్వెల్ దంపతులకు ఆర్సీబీ జట్టు తమ అధికారక ట్విటర్ ఖాతా ద్వారా ప్రత్యేకంగా విషెస్ తెలియజేసింది.